Population: నేటితో 800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా
- ప్రపంచ జనాభాపై ఐరాస జనాభా నిధి సంస్థ నివేదిక
- 11 ఏళ్లలో 100 కోట్లు పెరిగిన ప్రపంచ జనాభా
- 2011లో 700 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా
- 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు
- 48 ఏళ్లలో రెట్టింపైన వైనం
ప్రపంచ జనాభా నేటితో 800 కోట్లకు చేరింది. 2011 అక్టోబరులో ప్రపంచ జనాభా 7 బిలియన్లు కాగా, 2022 నవంబరు 15తో అది 8 బిలియన్లకు పెరిగింది. కేవలం 11 ఏళ్లలోనే భూమండలంపై 100 కోట్ల జనాభా పెరిగినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 1974లో 400 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా ఈ 48 సంవత్సరాల్లో రెట్టింపైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ వెల్లడించింది.
కాగా, ప్రపంచంలో చైనా, భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశాలు అని తెలిసిందే. ప్రపంచ జనాభాలో 36 శాతం ఈ రెండు దేశాల్లోనే ఉంది. అయితే, 2023 నాటికి జనాభా విషయంలో భారత్... చైనాను అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రస్తుతం చైనా జనాభా 144 కోట్లు కాగా, భారత్ జనాభా 138 కోట్లు.