IPL 2023: ఈ ఆటగాళ్లు మాకొద్దు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లు వీరే
- కెప్టెన్ మాయంక్ అగర్వాల్ ను వదిలేసిన పంజాబ్ కింగ్స్
- కీరన్ పోలార్డ్ వంటి స్టార్ ను వదులుకున్న ముంబై
- ఢిల్లీ నుంచి కేకేఆర్ జట్టులోకి శార్ధూల్ ఠాకూర్
ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు ఈ ఏడాది డిసెంబర్ 23న కోచిలో మినీ వేలం జరగనుంది. దీనికంటే ముందు 10 ఫ్రాంచైజీలు తాము అట్టి పెట్టుకునే ఆటగాళ్లు, విడుదల చేసే ఆటగాళ్ల వివరాలను ఐపీఎల్ పాలకమండలికి తెలియజేశాయి. ఈ జాబితా తర్వాత అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఐపీఎల్ వేలం జరగనుంది. మొత్తం 87 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
1. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)
డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిషాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కేఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ ను సీఎస్కే విడుదల చేసింది. ఈ ఫ్రాంచైజీ వద్ద 20.45 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో మినీ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
2. ముంబై ఇండియన్స్ (ఎంఐ)
కీరన్ పోలార్డ్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, డానియల్ శామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ విడుదలయ్యారు. రూ.20.55 కోట్ల పర్స్ మిగిలి ఉంది.
3. సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్)
కేన్ విలయమ్సన్, నికోలస్ పూరన్, జగదీష్ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెఫర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబ్బాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుషాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ను వదిలేసుకుంది. రూ.42.25 కోట్లు మిగిలాయి.
4. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)
శార్థూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మణిదీప్ సింగ్ ను విడుదల చేసింది. రూ.19.45 కోట్ల పర్స్ ఉంది.
5. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)
అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిషెల్, జేమ్స్ నీషామ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్ నిల్, రస్సీ వాన్ డర్ డుస్సెన్, శుభమ్ గార్గ్, తేజాస్ బరోకాను రాజస్థాన్ జట్టు వదిలేసుకుంది. రూ.13.2 కోట్ల మిగులు నిల్వలు ఉన్నాయి.
6. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)
జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లవ్ నిత్ సిసోడియా, షెర్ఫేన్ రూదర్ ఫోర్డ్ ను విడిచి పెట్టింది. రూ.8.75కోట్ల నిధులు ఉన్నాయి.
7. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)
ఆండ్య్రూ టై, అంకింత్ రాజ్ పుత్, దుష్మంత చమీర, ఎవిన్ లెవిస్, జేసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ ను విడుదల చేసింది. రూ.23.35 కోట్లు మిగిలాయి.
8. గుజరాత్ టైటాన్స్ (జీటీ)
రహ్మనుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గుర్ కీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరాన్ ను వద్దనుకుంది. రూ.19.25 కోట్లు మిగిలాయి.
9. కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)
ప్యాట్ కమిన్స్, శామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ నబి, చమిక కరుణరత్న, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రతమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ ను కేకేఆర్ విడుదల చేసింది. ఢిల్లీ విడిచిపెట్టిన శార్ధూల్ ఠాకూర్ ను తీసుకుంది. రూ.7.05 కోట్లు మిగిలాయి.
10. పంజాబ్ కింగ్స్
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తోపాటు ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్ కండ్, సందీప్ శర్మ, వ్రిట్టిక్ ఛటర్జీను విడుదల చేసి, రూ.32.2 కోట్లు మిగుల్చుకుంది.