Amazon: 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్​

Amazon confirms layoffs informs around 10000 impacted employees through email
  • అధికారికంగా ప్రకటించిన ఈ కామర్స్ సంస్థ
  • ప్రభావిత ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం
  • రెండు నెలల నోటీస్ టైం ఇచ్చిన యాజమాన్యం
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత పెట్టాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 10 వేల మందిని ఉగ్యోగాల నుంచి తొలగిస్తోంది. తొలగింపు ప్రక్రియ బుధవారం ప్రారంభమవగా.. తాజాగా అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అసాధారణ, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ శ్రామిక శక్తిని తగ్గిస్తున్నట్టు అమెజాన్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ లింప్ పేరిట వెలువడిన ఈ అధికారిక ప్రకటనలో ప్రభావిత ఉద్యోగుల తొలగింపుల గురించి కంపెనీ ఇప్పటికే తెలియజేసినట్టు వెల్లడించింది. 

వేటు ఎదుర్కొంటున్న ప్రతి ఉద్యోగితో మాట్లాడి, కొత్త ఉపాధి మార్గాలను అందించేందుకు సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు తొలగింపు గురించి అధికారిక మెయిల్ పంపింది. వేటు ఎదుర్కొంటున్న వాళ్లు అమెజాన్ లో ఇతర విభాగాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి రెండు నెలల సమయం (నోటీస్ టైం) ఇచ్చింది. సదరు ఉద్యోగులు కొత్త పాత్రను కనుగొనడంలో విఫలమైతే, విభజన చెల్లింపు, పరివర్తన ప్రయోజనాలు, బయట జాబ్ ప్లేస్ మెంట్ కు సహాయం అందించే ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఫేస్‌బుక్ పేరెంట్ మెటా కూడా గత వారం ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. ఫేస్ బుక్ గత వారం సుమారు 11,000 మందిని తగ్గించింది.
Amazon
layoffs
10000 employees
impact

More Telugu News