fifa world cup: ‘మాకు బీర్లు కావాలి’ నినాదాలతో హోరెత్తిన ఫిఫా ప్రపంచ కప్ స్టేడియం

Fans Chant We Want Beer At Alcohol Free FIFA World Cup Opener

  • ఖతార్ తో తొలి మ్యాచ్ లో నినాదాలు చేసిన ఈక్వెడార్ అభిమానులు 
  • ప్రపంచకప్ స్టేడియాల్లో బీర్లను నిషేధించిన ఆతిథ్య దేశం, ఫిఫా
  • అభిమానుల నుంచి తీవ్ర నిరసన

ఖతార్ వేదికగా ఫిఫా పురుషుల ప్రపంచ కప్ ఆదివారం రాత్రి ఘనంగా మొదలైంది. టోర్నమెంట్ ఆరంభ వేడులను అట్టహాసంగా నిర్వహించారు. పలు దేశాలకు చెందిన నాయకులు హాజరైన వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలు ఇచ్చారు. ఖతార్ సంప్రదాయం ఉట్టిపడేలా కళా రూపాలు ప్రదర్శించారు. అనంతరం జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఈక్వెడార్ 2–0 తేడాతో ఆతిథ్య ఖతార్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ ఆటగాడు వాలెన్సియో 16, 31వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి తమ జట్టును గెలిపించాడు.
 
ఈ మ్యాచ్ జరుగుతుండగా ఈక్వెడార్ ఆటగాళ్లు గోల గోల చేశారు. ‘క్వెరెమోస్ సెర్వేజా, క్వెరెమోస్ సెర్వేజా’ అంటూ స్పానిష్ భాషలో అరిచారు. ‘మాకు బీర్లు కావాలి’ అనేది దీని అర్థం. అరబ్ దేశమైన ఖతార్లో కఠినమైన నియమాలు ఉంటాయి. బహిరంగ మద్యపానంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో నిషేధం ఉంది. ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా స్టేడియాల్లో బీర్లు సహా మద్యం అమ్మడాన్ని, సేవించడాన్ని ఖతార్ తో పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య నిషేధించింది. దీనిపై సాకర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలోన ఈక్వెడార్ ప్రేక్షకులు బీర్లు కావాలంటూ తొలి మ్యాచ్ లో నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News