Elon Musk: ఎలాన్ మస్క్ ను తక్కువ అంచనా వేయకండి.. హర్ష్ గోయెంకా

Elon Musk ahead of his time people are underestimating his genius Harsh Goenka
  • అతడి పిచ్చితనానికి కచ్చితంగా అర్థం ఉంటుందన్న గోయెంకా 
  • మనం అర్థం చేసుకోలేని గేమ్ ప్లాన్ ఉండొచ్చన్న అభిప్రాయం
  • అంచనా వేసే ముందు కొంత సమయం ఇద్దామని ట్వీట్
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ప్లాట్ ఫామ్ ను రూ.3.6 లక్షల కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ‘ట్విట్టర్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సగం మంది ఉద్యోగులను మస్క్ తొలగించగా.. మిగిలిన వారు అసాధారణ స్థాయిలో రోజంతా పని చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో మస్క్ తీరు నచ్చక మిగిలిన వారు కూడా ఒక్కొక్కరు ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో మస్క్ ట్విట్టర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలో, ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్, మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరైన హర్ష గోయంకా మాత్రం ఎలాన్ మస్క్ ను తక్కువ అంచనా వేయకండి అంటున్నారు. ‘‘మేధావి ఎలాన్ మస్క్ ను మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అతడి పిచ్చితనానికి కచ్చితంగా ఏదో ఒక విధానం అంటూ ఉంటుంది. అది టెస్లా అయినా, స్పేస్ ఎక్స్ అయినా లేక బోరింగ్ కంపెనీ అయినా సరే అతడు తన కాలానికంటే ముందున్నాడు. అతడి వద్ద తప్పకుండా మనం అర్థం చేసుకోలేని గేమ్ ప్లాన్ ఉంటుంది. అతడిని అంచనా వేసే ముందు, అతడికి కొంత సమయం ఇచ్చి చూద్దాం’’ అని గోయంకా ట్వీట్ చేశారు.
Elon Musk
ahead of his time
underestimating
genius
Harsh Goenka

More Telugu News