Sanitary Pads: శానిటరీ ప్యాడ్స్ లో హానికారక రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
- థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ల గుర్తింపు
- అన్ని ప్రముఖ శానిటరీ నాప్కిన్లది ఇదే పరిస్థితి
- ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ సంస్థ అధ్యయనం వెల్లడి
ఈ వివరాలు వింటే.. శానిటరీ ప్యాడ్స్ ను ఉపయోగించే మహిళలు ఉలిక్కి పడతారు. మనదేశంలో పేరొందిన శానిటరీ నాప్కిన్ లు అన్నింటిలో హానికారక రసాయనాలు ఉన్నట్టు ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. మన దేశంలో ఈ రసాయనాల వినియోగాన్ని పరిమితం చేసే ఎటువంటి నిబంధనలు లేకపోవడమే వాటి విచ్చలవిడి వినియోగానికి కారణమని తెలిపింది.
దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే టాప్ 2 శానిటరీ ప్యాడ్స్ లో ఆరు రకాల థాలేట్స్ ఉంటున్నాయి. మొత్తం మీద 12 రకాల థాలేట్స్ ను పరిశోధకులు గుర్తించారు. ఈ థాలేట్స్ వల్ల ఎండోమెట్రియోసిస్, గర్భధారణ సంబంధిత సమస్యలు, గర్భంలో శిశువు ఎదుగుదలపై ప్రభావం, ఇన్సులిన్ నిరోధకత, హైపర్ టెన్షన్ తదితర సమస్యలు కారణమవుతాయని చెబుతున్నారు.