Jaya Prada: దలీప్ తాహిల్ పై జయప్రద చేయిచేసుకుందా?.. వివరణనిచ్చిన సీనియర్ నటుడు!  

Did Jaya Prada slap Dalip Tahil while filming a rape scene Latter clarifies
  • ఆఖరీ రాస్తా సినిమాలో రేప్ సీన్ లో తాహిల్ శ్రుతి మించినట్టు కథనాలు
  • అసలు తాను జయప్రదతో కలసి నటించలేదన్న తాహిల్
  • ఆ వీడియోలు ఏవో చూపిస్తే సంతోషిస్తానని వ్యాఖ్య
సినీ నటుల గురించి ప్రజల్లో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో లేనిపోని వదంతులు కూడా పుట్టుకొస్తుంటాయి. గతంలో వచ్చిన 'ఆఖరీ రాస్తా' హిందీ సినిమాలో ఓ రేప్ సీన్ లో నటించే క్రమంలో ప్రముఖ నటి జయప్రద.. ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ చెంప పగులగొట్టినట్టు ఇటీవల ప్రచారం నడుస్తోంది. రేప్ సీన్లో నటించే క్రమంలో అసౌకర్యం అనిపించడంతో జయప్రద చేయి చేసుకుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై చివరికి దలీప్ తాహిల్ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

‘‘జయప్రదతో కలసి ఒక రేప్ సీన్ లో నటించినట్టు.. కొంత కాలంగా నేను కూడా ఈ వార్తలను చూస్తున్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు వీటిల్లో ఉంది. అసలు నేను జయప్రదతో కలసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ, ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అని తాహిల్ వివరణ ఇచ్చారు.
Jaya Prada
slapping
Dalip Tahil
bollywood
hindi movie

More Telugu News