Somireddy Chandra Mohan Reddy: కాకాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలి: సోమిరెడ్డి
- నాపై తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు పత్రాలు తీసుకొచ్చారన్న సోమిరెడ్డి
- కోర్టులో ఉన్న పత్రాలను చోరీ చేశారని ఆరోపణలు
- కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని వ్యాఖ్య
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు పత్రాలను తీసుకొచ్చారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కోర్టు అధీనంలో ఉన్న ఈ తప్పుడు పత్రాలను చోరీ చేశారని అన్నారు. అసలే తప్పుడు పత్రాలు... అవి కూడా చోరీకి గురయ్యాయని చెప్పారు. ఇలాంటి నేరాలు చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి జగన్ వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.