High Courts: హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
- దేశంలోని పలు హైకోర్టుల న్యాయమూర్తులకు స్థానచలనం
- ఏపీ, తెలంగాణ, మద్రాస్ హైకోర్టు జడ్జీల బదిలీలు
- ఏపీ న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
దేశంలోని పలు హైకోర్టుల జడ్జిలను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని పేర్కొంది. ఏపీ హైకోర్టుకు చెందిన మరో జడ్జి జస్టిస్ రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలితను కర్ణాటకు హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
అటు, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలిజీయం తెలిపింది. మద్రాస్ హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని పేర్కొంది.