Ch Malla Reddy: మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఎంత నగదు, బంగారాన్ని సీజ్ చేశారంటే..!

Rs 18 Cr cash and 15 kg gold seized in IT raids on minister Malla Reddy

  • రూ. 18.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారం స్వాధీనం
  • మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారుల నోటీసులు
  • సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై జరిగిన ఐటీ దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. దాడుల అనంతరం మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వచ్చే సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. మరోవైపు ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ. 18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఇంకోవైపు ఈ దాడులపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే తమపై దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని అన్నారు. వందల మంది అధికారులతో సోదాలు నిర్వహించారని... ఇలాంటి దాడులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే తన ధైర్యం అని చెప్పారు. ఐటీ విచారణకు సహకరిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News