gurukulam: తెలంగాణ గురుకులాల్లో 9 వేల పోస్టుల భర్తీ.. డిసెంబర్ లో నోటిఫికేషన్!

Notification for posts in Telangana Gurukula to be released in December

  • బోధన, బోధనేతర పోస్టులు మొత్తం కలిపి 9 వేలకు పైనే..
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన గురుకుల విద్యా సంస్థలు
  • నియామకాలకు ఏర్పాట్లు చేస్తున్న గురుకులాల బోర్డు
  • ప్రాధాన్యతా క్రమంలో నోటిఫికేషన్లు జారీ, పోస్టుల భర్తీ

తెలంగాణలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీ ప్రక్రియలో వేగం పెరిగింది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇందులో బోధన, బోధనేతర పోస్టులు ఉన్నాయి. అయితే, గిరిజన రిజర్వేషన్ల సమస్యతో పాటు ఇతర అవాంతరాలతో నోటిఫికేషన్ల జారీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా, మరో వారం రోజుల్లో.. అంటే డిసెంబర్ లో గురుకులాల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను గురుకుల సొసైటీలు నియామక బోర్డుకు సమర్పించాయి. వీటిపై పోస్టుల వారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాల పరిశీలనకు బోర్డు సిద్ధమైంది. వారం రోజుల్లో ఈ పరిశీలన పూర్తిచేసి, లోటుపాట్లను సవరించి నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాధాన్యతాక్రమంలో నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని గురుకులాల నియామక బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News