Britain: విదేశీ విద్యార్థులకు చెక్ పెట్టే యోచనలో బ్రిటన్ ప్రధాని

Rishi Sunak to restrict number of foreign students in UK to control migration
  • బ్రిటన్‌లో పెరిగిపోతున్న వలస విద్యార్థుల సంఖ్య
  • గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3.31 లక్షలు అధికం
  • విదేశీ విద్యార్థులపై ఆంక్షలకు సిద్ధమైన ప్రభుత్వం!
బ్రిటన్‌లో పెరిగిపోతున్న వలసలకు అడ్డుకట్ట వేయాలని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. గతేడాది 1.73 లక్షల మంది బ్రిటన్‌కు వలస వెళ్లగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 5.04 లక్షలకు పెరిగినట్టు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది. అంటే ఒక్క ఏడాదిలోనే వలసల సంఖ్య ఏకంగా 3.31 లక్షలు పెరిగింది. 

వలసలు విపరీతంగా పెరిగిపోతుండడంపై ఆందోళన చెందుతున్న ప్రభుత్వం వాటికి చెక్ చెప్పాలని నిర్ణయించింది. గతంలో చైనా నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున బ్రిటన్‌కు వెళ్లేవారు. ఈసారి మాత్రం చైనా విద్యార్థుల సంఖ్యను భారత విద్యార్థులు అధిగమించారు. బ్రిటన్ యూనివర్సిటీలు సొంత దేశ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు వసూలు చేస్తాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు విదేశీ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తాయి. ఇప్పుడు విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధిస్తే వర్సిటీలు దివాలా తీసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల రాకపై ప్రభుత్వం కనుక ఆంక్షలు విధిస్తే ఆ ప్రభావం భారత్‌పైనే ఎక్కువగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Britain
Students
Rishi Sunak

More Telugu News