Hyderabad: రాంగ్ రూట్ లో వస్తే వీపు విమానంమోతే.. హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం!

Hyderabad traffic rules more strict from today

  • ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700 ఫైన్
  • ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 జరిమానా

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. రాంగ్ రూట్ లో రావడం, ట్రిపుల్ రైడింగ్ తదితర కారణాలవల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చేసిన అధ్యయనంలో తేలింది. దీంతో, వీటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. 

ఇందులో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700, ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 వరకు జరిమానా విధించనున్నారు. జీబ్రా లైన్ దాటిన వాహనానికి రూ. 100, ఫ్రీలెఫ్ట్ కు అడ్డంగా వాహనాన్ని నిలిపితే రూ. వెయ్యి ఫైన్ వేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడరాదని, ప్రతి ఒక్కరూ రూల్స్ ని కచ్చితంగా పాటించాలని, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విన్నవించారు. రూల్స్ ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరి సహకారంతో హైదరాబాద్ ను ప్రమాద రహిత నగరంగా మార్చాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News