Maharashtra: పంట నష్టపోతే బీమా కంపెనీ నుంచి వచ్చిన పరిహారం రూ.1.76!
- మహారాష్ట్రలో రైతాంగానికి చేదు అనుభవాలు
- పంట నష్ట పరిహారం కింద రూపాయిల్లో విదిలిస్తున్న బీమా సంస్థలు
- కట్టిన ప్రీమియం అంత కూడా చెల్లించని పరిస్థితి
మహారాష్ట్రలో పంట బీమా విషయంలో రైతులకు చిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. పీఎం ఫసల్ బీమా యోజన కింద కేవలం రూపాయిల్లో పరిహారం అందుతుంటే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. పర్బణి జిల్లా దశాల గ్రామంలో ఓ రైతు రెండు ఎకరాల్లో సోయా, కంది, శనగ పంటలను సాగు చేశాడు. ఇందుకోసం రూ.25,000 పెట్టుబడిగా పెట్టాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే.. బీమా సంస్థ రైతు చేతిలో 1.76 రూపాయిలు పెట్టింది. ఇదే మాదిరి మరో రైతుకు రూ.14.21, మరో రైతుకు రూ.37.31 చొప్పున పంట నష్ట పరిహారం కింద బీమా కంపెనీలు చెల్లించడం చూస్తే మూర్ఛపోవాల్సి వస్తుందేమో!