Gangula Kamalakar: టీఆర్ఎస్ నేతలు గంగుల, రవిచంద్రకు సీబీఐ నోటీసులు
- నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో నోటీసులు
- రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని గంగులకు నోటీసులు
- గంగుల, రవిచంద్రతో శ్రీనివాస్ కలిసున్న ఫొటోలను గుర్తించిన సీబీఐ అధికారులు
తెలంగాణలో టీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు అందించింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కు చెందిన కేసులో నోటీసులు అందజేసింది. ఈ ఉదయం కరీంనగర్ లో గంగుల ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో గంగుల లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.
రేపు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ ను సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. గంగుల, రవిచంద్రతో శ్రీనివాస్ కలిసున్న ఫొటోలను సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఫోన్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.