USA: చైనా జిబౌతీ మిలిటరీ బేస్ తో భారత్ కు ముప్పు: అమెరికా
- ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను మోహరించే అవకాశం
- భారత్ కు పెను సవాల్ గా మారుతుందన్న అమెరికా రక్షణశాఖ
- ఇండియా పసిఫిక్ ప్రాంతంలో మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరించే పనిలో చైనా ఉందని వెల్లడి
జిబౌతీలో చైనా ఏర్పాటు చేసిన మిలిటరీ బేస్ తో భారత్ కు ముప్పు ఉందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. ఈ మిలిటరీ బేస్ లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధ నౌకలను చైనా మోహరించే అవకాశం ఉందని తన వార్షిక నివేదికలో యూఎస్ రక్షణశాఖ వెల్లడించింది. ఈ మిలిటరీ బేస్ భారత్ కు పెను సవాలుగా మారుతుందని అంచనా వేసింది. ఈ బేస్ లో అదనపు మిలిటరీ లాజిస్టిక్స్ వసతుల ఏర్పాటును కూడా చైనా పరిశీలిస్తోందని చెప్పింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఇప్పటికే అక్రమంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోందని.... దీనికి తోడు ఇండియా పసిఫిక్ ప్రాంతంలో తన మిలిటరీ సామర్థ్యాన్ని మరింత విస్తరించే పనిలో ఉందని చెప్పింది. ఈమేరకు అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో యూఎస్ రక్షణశాఖ వెల్లడించింది.