Bill Clinton: బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్

USA Ex President Bill Clinton tested positive for Corona
  • తాను కరోనా బారిన పడ్డానని వెల్లడించిన బిల్ క్లింటన్
  • స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని వెల్లడి
  • వ్యాక్సిన్, బూస్టర్ వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని వ్యాఖ్య
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన ట్వీట్ చేశారు. 

అయితే, కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని... ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, ఇంటి వద్ద తన పనులతో బిజీగానే ఉన్నానని చెప్పారు. వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేయించుకోవడం వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసులు వేయించుకోవాలని కోరారు. మనం శీతాకాలంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమని చెప్పారు.
Bill Clinton
USA
Corona Virus

More Telugu News