paytm: అలా చేస్తే.. 8 డాలర్లు కాదు 80 డాలర్లు ఇస్తాం!.. ట్విట్టర్ బ్లూటిక్ ఫీజుపై పేటీఎం చీఫ్ వ్యాఖ్య

Not  8 dollors Paytm CEO is willing to pay 80 dollors if Elon Musk releases this Twitter feature
  • ఫేక్ అకౌంట్లను తొలగిస్తే ఫీజు మరింత పెంచినా సమ్మతమేనన్న విజయ్ శేఖర్ శర్మ
  • పేటీఎం పేరుతో ట్విట్టర్లో నకిలీ కస్టమర్ కేర్ ఖాతా ఉందని వెల్లడి
  • ఇలాంటి ఖాతాలను బ్లాక్ చేసే అవకాశం కస్టమర్లకు ఇవ్వాలంటూ ట్వీట్
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడద తొలగిస్తే నెలనెలా చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరివేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు కాదు 80 డాలర్లు అయినా చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేటీఎం ఎదుర్కొంటున్న ఇబ్బందిని ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ దృష్టికి తీసుకొచ్చారు.

పేటీఎం కస్టమర్ కేర్ పేరు, పేటీఎం అధికారిక లోగోతో నడుస్తున్న ట్విట్టర్ అకౌంట్ ను రీట్వీట్ చేస్తూ.. ఇలాంటి నకిలీ ఖాతాలను ఎప్పటికప్పుడు ఏరివేసే సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ఎలాన్ మస్క్ ను కోరారు. అలా చేస్తే ట్విట్టర్ బ్లూ టిక్ ఫీజు ఒకటి కాదు పది రెట్లు పెంచినా మారుమాట్లాడకుండా చెల్లించేందుకు సిద్ధమని శర్మ వివరించారు.

ట్విట్టర్ లో నకిలీలను తొలగించేందుకు, సెలబ్రిటీల ఖాతాలకు అధికారిక గుర్తింపునిచ్చేందుకు కంపెనీ ఆయా ఖాతాలకు బ్లూ టిక్ బ్యాడ్జిని అందిస్తుంది. ఇందుకోసం నెలనెలా నాలుగు డాలర్ల ఫీజును ఆయా వ్యక్తులు, సంస్థల నుంచి ట్విట్టర్ వసూలు చేసేది. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ ఈ ఫీజును రెట్టింపు చేశారు. నెలనెలా 8 డాలర్లు చెల్లించాలని తేల్చిచెప్పాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా మస్క్ వెనక్కి తగ్గలేదు.
paytm
Twitter
blue tick fee
8 dollors
vijay shekar sharma
Elon Musk

More Telugu News