K Kavitha: విచారణకు రమ్మంటూ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నోటీసులు
- ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలన్న సీబీఐ
- హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ విచారణకు హాజరు కావచ్చన్న సీబీఐ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఉందనే కోణంలో సీబీఐ విచారణ జరపనుంది.
కవితకు సీబీఐ నోటీసులు జారీ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.