senior citizens: సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్

Canara bank offering Jeevandhara savings account for senior citizens

  • జీరో బ్యాలెన్స్ తో ‘జీవన్ ధారా’ ఖాతా
  • ఏటా 4 శాతం వడ్డీ.. ఉచితంగా డెబిట్ కార్డు
  • పెన్షన్ ఖాతా ఉంటే ఉచితంగా రూ. 2 లక్షల బీమా
  • 60 ఏళ్లు పైబడిన వృద్ధులకే అవకాశం

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఆఫర్ చేస్తోంది. జీవన్ ధారా పేరుతో బ్యాంకు ఆఫర్ చేస్తున్న ఈ ఖాతాను జీరో బ్యాలెన్స్ తో ఓపెన్ చేసుకోవచ్చని పేర్కొంది. అరవై ఏళ్లు పైబడిన వారు ఈ ఖాతా తెరిచి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చని చెబుతోంది. ఏటా 4 శాతం వడ్డీతో పాటు, కెనరా బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉన్న వారికి ఉచితంగా రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాన్ని పొందొచ్చని వివరించింది.

ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
ఖాతాలో వార్షికంగా సగటున రూ. 1700 బ్యాలెన్స్‌ను మెయింటెన్‌ చేయాలి.. ఖాతాలో ఉన్న సొమ్ముకు ఏటా 4 శాతం వడ్డీ రెండు విడతలుగా బ్యాంకు చెల్లిస్తుంది. ఉచిత డెబిట్ కార్డుతో పాటు చెక్ బుక్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు కూడా జీవన్ ధారా ఖాతాదారులకు ఉచితమే. కెనరా పెన్షన్ ప్రోడక్ట్ కింద నెలవారీ పెన్షన్‌కు 10 రెట్లు లేదా గరిష్ఠంగా రూ. 2 లక్షల రుణం తీసుకోవచ్చు. ఇక పెన్షన్‌ ఖాతాగా ఉపయోగిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. అంతేకాదు.. లాకర్ తీసుకునే సమయంలో జీవన్ ధారా ఖాతాదారులు 25 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని బ్యాంకు అధికారులు చెప్పారు.

కావాల్సిన పత్రాలు..
  • పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్ లేదా ఓటర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్(గుర్తింపు కోసం)
  • వయసు నిర్ధారణకు సంబంధించిన సర్టిఫికెట్
  • సీనియర్ సిటిజన్లు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఖాతా తెరవొచ్చు. బ్యాంకు దాకా వెళ్లలేని పరిస్థితిలో ఉంటే బ్యాంకు ప్రతినిధి వచ్చి ఖాతా తెరిపిస్తారు

  • Loading...

More Telugu News