Donald Trump: అమెరికా రాజ్యాంగాన్నే రద్దు చేయాలంటూ ట్రంప్ డిమాండ్

Massive fraud Donald Trump calls for termination of US Constitution

  • ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయని ట్రంప్ ఆరోపణ
  • రాజ్యాంగ నిర్మాతలు ఈ విధమైన మోసపూరిత ఎన్నికలను కోరుకోలేదని వ్యాఖ్య
  • డెమోక్రాట్లకు టెక్ దిగ్గజాల సాయంపై విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సహనాన్ని కోల్పోయారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయంటూ మరోసారి ఆరోపించిన ట్రంప్.. ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికలలో డెమోక్రాట్లు సెనేట్ పై మరింత ఆధిపత్యం సంపాదించి, ట్రంప్ మద్దతు కలిగిన రిపబ్లికన్లు ఓడిపోవడం తెలిసిందే. దీంతో ట్రంప్ పాత ఆరోపణలనే మరోసారి వినిపించారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ లోగడ కూడా ఆరోపించారు. 2020లో హంటర్ బైడెన్ ల్యాప్ టాప్ కు సంబంధించి న్యూయార్క్ పోస్ట్ లో ప్రచురించిన కథనంపై ట్విట్టర్ అంతర్గత ఈ మెయిల్స్ వెలుగు చూసిన క్రమంలో ట్రంప్ స్పందించారు. ‘‘ఈ స్థాయిలో పెద్ద ఎత్తున మోసాలు జరగడం, అన్ని నిబంధనలు, నియంత్రణలను తుంగలో తొక్కడమే’’ అని ట్రంప్ పేర్కొన్నారు. డెమోక్రాట్లకు అనుకూలంగా టెక్నాలజీ దిగ్గజాలు వ్యవహరించినట్టు ట్రంప్ విమర్శించారు. ‘‘మన గొప్ప వ్యవస్థాపకులు మోసపూరిత, తప్పుడు ఎన్నికలను కోరుకోలేదు’’ అని ట్రంప్ తన వ్యక్తిగత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News