Hansika: ఘనంగా జరిగిన వివాహం.. ఒక్కటైన హన్సిక, సొహైల్ ప్రేమజంట

Hansika and Sohael married
  • జైపూర్ లోని రాజకోటలో ఘనంగా పెళ్లి వేడుక
  • సింధి సంప్రదాయంలో జరిగిన పెళ్లి
  • సొహైల్ కు ఇది రెండో వివాహం
సినీ నటి హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడారు. జైపూర్ లోని ఒక రాజకోటలో వీరి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సింధి సంప్రదాయంలో పెళ్లిని నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా... సొహైల్ కు రెండో వివాహం కావడం గమనార్హం. హన్సిక స్నేహితురాలితోనే ఆయనకు తొలి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం మొదలయింది. తెలుగు, తమిళంలో హన్సిక ఎక్కువ సినిమాలు చేశారు. ఇటీవలే ఆమె 50వ సినిమా విడుదలయింది. మరోవైపు, వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hansika
Marriage
Tollywood
Kollywood

More Telugu News