celebritys: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ స్టార్స్

celebritys with unusual health problems

  • షారుఖ్ ఖాన్ భుజానికి ఐదు శస్త్రచికిత్సలు
  • ఏకంగా ఒక ఫిజీషియన్ ను నియమించుకున్న షారుఖ్ 
  • సల్మాన్ ఖాన్ కు ట్రిజెమినల్ న్యూరాల్జియా
  • సమంతా రుతు ప్రభుకు మయోసైటిస్

డబ్బులున్న వారికి ఎలాంటి లోటు ఉండదు.. కావాల్సింది తినొచ్చు.. ఎంత ఖర్చయినా ఆరోగ్యంగా ఉండొచ్చు అని కొందరు అనుకుంటుంటారు. డబ్బుంటే ఆరోగ్యానికి హామీ ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇందుకు సంబంధించి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పేదవారు అయినా ఆరోగ్యంగా ఉంటున్న వారు ఎందరో.. డబ్బులుండీ రోగాలతో వేదన పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. అలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటులను పరిశీలిస్తే..

 షారుఖ్ ఖాన్ చేయి, వెన్నెముక నొప్పితో దీర్ఘకాలంగా బాధపడుతున్నారు. ఐదు పర్యాయాలు ఆయన భుజానికి శస్త్రచికిత్సలు అయ్యాయి. అయినా, దాన్నుంచి ఆయన పూర్తిగా బయటపడలేదు. ప్రత్యేకంగా ఓ ఫిజీషియన్ ను ఆయన శాశ్వతంగా నియమించుకోవాల్సి వచ్చింది. హృతిక్ రోషన్ కు క్రానిక్ సబ్ డ్యూరల్ హెమటోమా నిర్ధారణ అయింది. ఇది మెదడు దెబ్బతినడం వల్ల వచ్చిన సమస్య. సినిమా షూటింగ్ లలో భాగంగా తలకు అయిన గాయాలే ఇందుకు కారణం. దీంతో శస్త్రచికిత్స ద్వారా ఆయన మెదడులో క్లాట్ ను తొలగించుకున్నారు.

యామి గౌతమ్ కెరటోసిస్ పిలారిస్ అనే సమస్యను ఎదుర్కొంటోంది. దీనివల్ల చర్మంపై అక్కడక్కడా ఎండిపోయినట్టు ప్యాచెస్ ఏర్పడతాయి.

 ఇక సల్మాన్ ఖాన్ ట్రిజెమినల్ న్యూరాల్జియాతో బాధపడుతున్నారు. దీనివల్ల ముఖంలోని ట్రిజెమినల్ నరం వాచిపోతుంది. దీని కారణంగా దవడ, ముఖంపై నొప్పి వేధిస్తుంటుంది. దీనితో బాధపడే వారికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయట. అందుకే దీన్ని ఆత్మహత్య అనారోగ్యంగా పేర్కొంటారు. 

వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల చెవి అంతర్గత వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో మెదడుకు సంకేతాలు వెళ్లడంతో తప్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా తల తిరగడం, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది.

 సమంతా రుతు ప్రభు ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్ బారిన పడినట్టు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. చికిత్సతో దీన్నుంచి తాను బయటపడతానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ టీనేజ్ నుంచే డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటోంది. దీన్ని నియంత్రణలో పెట్టుకోవడం ఆహారం, శారీరక వ్యాయామాలతో దీన్ని ఆమె నియంత్రణలోకి తెచ్చుకుంది. 

స్నేహ ఉల్లాల్ సైతం ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించింది. దీని కారణంగా ఆమె 30-40 నిమిషాల నుంచి నించొని ఉండలేదు. 

వెటరన్ యాక్టర్ అమితాబచ్చన్ జీవితంలో రెండు సందర్భాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. 1982లో కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన ప్లీహం పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. క్లినికల్లీ డెడ్ అయినట్టు కూడా భావించారు. కానీ, చికిత్సతో ఆయన కోలుకున్నారు. 1984లో మ్యాస్థేనియా గ్రేవిస్ అనే కండరాల సమస్యను కూడా ఆయన చవిచూశారు.

  • Loading...

More Telugu News