Goblin Mode: ఆక్స్ ఫర్డ్ 2022 సంవత్సరం పదం ‘గోబ్లిన్ మోడ్’
- గడిచిన రెండు వారాలుగా పోల్ నిర్వహణ
- ఈ ఏడాది మూడు పదాలపై ఓటింగ్
- గోబ్లిన్ మోడ్ కు 3 లక్షల మందికి పైగా అనుకూలం
ప్రముఖ ఇంగ్లిష్ డిక్షనరీ ‘ఆక్స్ ఫర్డ్’ 2022 సంవత్సరం పదంగా ‘గోబ్లిన్ మోడ్’ను ప్రకటించింది. వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం మొదటిసారి. గడిచిన రెండు వారాల్లో ఈ పోల్ లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోబ్లిన్ మోడ్ పదానికి 3,00,000 మంది ఓటు వేశారు.
గోబ్లిన్ మోడ్ అంటే ఒక రకమైన ప్రవర్తనను చెప్పేందుకు ఉఫయోగించే పదం. అనాలోచితం, స్వీయ భావన, బద్ధకం, నిదానంగా, అత్యాశతో అనే అర్థాల కింద గోబ్లిన్ మోడ్ ను వాడుతుంటారు. ఈ పదం తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. నిఘంటు శాస్త్రవేత్తలు.. మెటావర్స్, స్టాండ్ విత్, గోబ్లిన్ మోడ్ అనే మూడు పదాలను తుదిగా ఎంపిక చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరారు.