North Korea: దక్షిణ కొరియా సినిమాలు చూశారని ఉత్తర కొరియాలో ఇద్దరు మైనర్లకు మరణశిక్ష అమలు

Two teenagers executed in North Korea for watching K Dramas and movies

  • కిమ్ జాంగ్ ఉన్ పాలనలో చట్టాలు అత్యంత కఠినం
  • ఇతర దేశాల సినిమాలు చూడడం దుష్ట కార్యం 
  • ఇద్దరు బాలలను కాల్చి చంపిన అధికారులు
  • బహిరంగంగా మరణశిక్ష అమలు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠ అనదగ్గ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కొరియా సినిమాలు చూసిన పాపానికి ఉత్తర కొరియాలో ఇద్దరు మైనర్లకు మరణశిక్ష అమలు చేశారు. 

ఉత్తర కొరియాలోని ర్యాన్ గాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఇద్దరు హైస్కూలు విద్యార్థులు దక్షిణ కొరియా కే-డ్రామాస్ (వెబ్ సిరీస్ లు), సినిమాలు, అమెరికా టీవీ షోలు చూడడమే కాకుండా, వాటిని విస్తృతస్థాయిలో షేర్ చేయడం, కొందరికి విక్రయించడం చేశారని అధికారులు అభియోగాలు మోపారు. 

ఉత్తర కొరియా చట్ట ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు చూడడం నిషిద్ధం. వారు చూడడమే కాకుండా, ఇతరులు కూడా చూడాలని ప్రోత్సహించారంటూ వారికి మరణశిక్ష విధించారు. ఆ ఇద్దరు మైనర్లను ఓ వైమానిక క్షేత్రం వద్ద బహిరంగంగా కాల్చి చంపారు. కిమ్ జాంగ్ ఉన్ పాలనలో టీనేజర్లు ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని 'దుష్ట కార్యకలాపాలు'గా పరిగణిస్తారు. 

కాగా, వీరిద్దరికీ శిక్ష విధించేటప్పుడు అందరూ తప్పనిసరిగా చూడాలని అధికారులు స్థానికులను బలవంతంగా వైమానిక క్షేత్రం వద్దకు తరలించారు.

  • Loading...

More Telugu News