Telangana: కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
- కేటీఆర్ డ్రగ్ బానిస అంటూ వ్యాఖ్యలు
- రక్తం, వెంట్రుకల నమూనాలు ఇచ్చి నిరూపించుకోవాలని సవాల్
- పొగాకు తినడంపై తాను సైతం పరీక్షలకు సిద్ధమన్న సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ కు మత్తు మందులు (డ్రగ్స్) సేవించడం అలవాటు ఉందంటూ, చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు చేయించుకుని, సచ్ఛీలుడిగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కు పొగాకు నమిలే అలవాటు ఉందన్న కేటీఆర్ విమర్శలపై నిర్మల్ ర్యాలీలో భాగంగా బండి సంజయ్ స్పందించారు.