Heart attack: ఈ సంకేతాలు కనిపిస్తే రక్త నాళాల్లో క్లాట్లు ఉన్నట్టే!

Heart health tips Signs that you have a blood clot in your arteries

  • ధమనుల్లో రక్తం గడ్డకడితే హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
  • సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే
  • చర్మంపై బ్లూ, ఎరుపు రంగులో, వాపు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి

గాయం అయినప్పుడు రక్తస్రావం కావడం సహజం. రక్తాన్ని గడ్డ కట్టించడం అన్నది శరీరం చేసే సహజ ప్రక్రియ. ప్లేట్ లెట్లు, ప్రొటీన్లు, కణాలు కలసి జెల్ మాదిరిగా అడ్డు పడి రక్తస్రావాన్ని ఆపుతాయి. కానీ, ఇలా రక్తస్రావం గడ్డకట్టిన తర్వాత అది దానంతట అదే కరిగిపోవాలి. లేకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఈ పరిస్థితిని థ్రాంబోసిస్ అంటారు. ధమనుల్లో ఏర్పడే క్లాట్లను ఆర్టీరియల్ క్లాట్లు అంటారు. కరోనా వైరస్ బాధితుల్లో ఈ క్లాట్ల రిస్క్ మొదటి రెండు విడతల్లో ఎక్కువగా కనిపించింది.

కరోనా బారిన పడిన ఏడాది తర్వాత ధమనుల్లో క్లాట్లు ఏర్పడే రిస్క్ ఉంటున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. గుండె కణజాలంలో ఉండే ఆర్టరీల్లో ఇలాంటి క్లాట్ల వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతేకాదు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుంది.

గుండె నుంచి శరీరంలోని అన్ని కణాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ ను అందేలా చూసేది ధమనులే. శరీరంలోని అన్ని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అవసరం. అందుకని రక్తంలో క్లాట్లను ముందుగా గుర్తించినట్టయితే ప్రాణ ప్రమాదం లేకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో క్లాట్లకు సంబంధించి కనిపించే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

చర్మం రంగు
చేతులు, కాళ్లల్లోని ధమనుల్లో క్లాట్లు ఉంటే అవి ఎరుపు, బ్లూ రంగులో కనిపించొచ్చు. ముఖ్యంగా క్లాట్లు వచ్చిన చోట చర్మం రంగు, ఇతర చోట్లతో పోలిస్తే మార్పు కనిపిస్తుంది. చర్మం పాలిపోయినట్టుగానూ ఉండొచ్చు.

వాపు
రక్తంలో గడ్డ కట్టడం వల్ల రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడితే అది రక్తనాళం వాపునకు దారితీస్తుంది. చేతులు, పొట్ట భాగంలోనూ ఇది కనిపించొచ్చు. 

నొప్పి
ఉన్నట్టుండి ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఆగమేఘాలపై హాస్పిటల్ చేరుకోవాలి. ధమనుల్లో క్లాట్లతో హార్ట్ ఎటాక్ వస్తే ఇలానే ఉంటుంది. చేతుల్లో, ముఖ్యంగా ఎడమ చేతివైపు కూడా నొప్పి కనిపిస్తుంది. 

శాస్వ ప్రక్రియ
గుండె, ఊపిరితిత్తులకు సమీప భాగాల్లో క్లాట్లు ఏర్పడినప్పుడు శ్వాస ప్రక్రియ కష్టంగా మారుతుంది. చెమటలు పట్టడం, మూర్ఛ రావడం జరగొచ్చు.

  • Loading...

More Telugu News