recharging: ప్రతి నెలా రీచార్జ్ అవసరం లేని మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు
- అన్ని టెలికం కంపెనీల నుంచి వార్షిక ప్లాన్లు
- ధర, ప్రయోజనాల్లో స్వల్ప వ్యత్యాసం
- డేటా వినియోగం ఆధారంగా ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు
ప్రతినెలా రీచార్జ్ చేసుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉండచ్చు. ఇలాంటి వారు ఏడాది కాల ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటే సరి. దాదాపు అన్ని టెలికం కంపెనీలు ఏడాది కాల ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి.
జియో 2545 ప్లాన్
ఇందులో 504జీబీ డేటా వస్తుంది. అంటే రోజూ 1.5జీబీ డేటా పరిమితి వర్తిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు, వాయిస్ కాల్స్ ఉచితం. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
జియో 2879 ప్లాన్
ఈ ప్లాన్ లో రోజూ 2 జీబీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. ఇక మిగిలిన అన్ని ప్రయోజనాలు రూ.2545 ప్లాన్ లో మాదిరే ఉంటాయి.
జియో 2999 ప్లాన్
ఈ ప్లాన్ లో రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. ఇవి కాక ఇతర ప్రయోజనాలు పై ప్లాన్లలో మాదిరే ఉంటాయి.
ఎయిర్ టెల్ 1799 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఏడాది కాల వ్యవధితో 24జీబీ 4జీ డేటా లభిస్తుంది. కాల్స్ ఉచితం. 3600 ఎస్ఎంఎస్ లు ఉచితం. వింక్ మ్యూజిక్, హలో ట్యూన్లు కూడా ఉచితమే.
ఎయిర్ టెల్ 2999 ప్లాన్
ఇందులో రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ ఏడాది. కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా వస్తాయి. వింక్ మ్యూజిక్, హలో ట్యూన్లు కూడా ఉచితమే.
ఎయిర్ టెల్ 3359
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా ఏడాది. రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. కాల్స్ ఉచితం. ఇవి కాకుండా రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మెబైల్ ఎడిషన్ ఉచితం. డిస్నీ హాట్ స్టార్ మొబైల్ ఏడాది పాటు ఉచితం. అపోలో 24/7 సబ్ స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం. హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితం.
వొడాఫోన్ ఐడియా (వీఐ) 2899 ప్లాన్
దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజూ 1.5 జీబీ ఉచిత డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించుకునే డేటా పూర్తిగా ఉచితం. అది రోజువారీ డేటా వినియోగం కిందకు రాదు.
వీఐ 3099
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. నిత్యం 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించుకునే డేటా పూర్తిగా ఉచితం. అది రోజువారీ డేటా వినియోగం కిందకు రాదు. ఏడాది పాటు డిస్నీ హాట్ స్టార్ సేవలను ఉచితంగా పొందొచ్చు.