BRS: టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్... ఈసీ నుంచి కేసీఆర్ కు లేఖ

TRS now turns into BRS

  • భారత రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్
  • అక్టోబరు 5న కేసీఆర్ ప్రకటన
  • ఈసీకి లేఖ రాసిన టీఆర్ఎస్  
  • తాజాగా ఆమోదం తెలిసిన ఈసీ

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాచరణలో తొలి అడుగు పడింది. టీఆర్ఎస్ పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు అధికారికంగా లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్ గా మారినట్టయింది. టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతూ కేసీఆర్ అక్టోబరులో ప్రకటించడం తెలిసిందే. 

కాగా, బీఆర్ఎస్ పార్టీ పేరు తనదేనంటూ ఓ యువకుడు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం వెల్లడైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బానోతు ప్రేమ్ గాంధీ అనే యువకుడు బీఆర్ఎస్ పేరును తనకే కేటాయించాలని కోరాడు. తాను బీఆర్ఎస్ పేరును కోరుతూ సెప్టెంబరు 5నే దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించాడు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు. కేసీఆర్ దసరా (అక్టోబరు 5) రోజున పార్టీ ప్రకటన చేసిన ఆధారాలను కూడా ప్రేమ్ గాంధీ ఈసీకి సమర్పించాడు. 

అయితే, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీపై అభ్యంతరాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 6వ తేదీతో ఆ ప్రక్రియను ముగించింది. తాజాగా, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ అధికారికంగా క్లియరెన్స్ ఇచ్చేసింది.

  • Loading...

More Telugu News