WhatsApp: వాట్సాప్ యాప్ అప్ డేట్ చేసుకుంటే.. ఎన్నో అద్భుత ఫీచర్లు

Update your WhatsApp to use these amazing recently launched features

  • వాట్సాప్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ పోల్ పెట్టుకోవచ్చు
  • కాల్ లింక్ పంపించి కాల్ లో చేరాలని కోరొచ్చు
  • అవతార్ ను క్రియేట్ చేసుకుని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవచ్చు
  • వీటి కోసం యాప్ ను అప్ డేట్ చేసుకోవడం అవసరం

వాట్సాప్ కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వచ్చింది. ఈ కొత్త సదుపాయాలను వినియోగించుకునేందుకు యూజర్లు తప్పకుండా తమ వాట్సాప్ యాప్ ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కు వెళ్లి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మెస్సేస్ యువర్ సెల్ఫ్
కొత్త ఫీచర్లలో‘మెస్సేజ్ యువర్ సెల్ఫ్’ ఒకటి. అంటే యూజర్ తన ఫోన్ నంబర్ కే మెస్సేజ్ పంపుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అనుకుంటున్నారా.. ? ఏదైనా మీడియా, సందేశాలు, ఫొటోలు స్టోర్ చేసుకుని తర్వాత చూసుకోవాలంటే వాటిని మన కాంటాక్ట్ కు పంపించుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. ఇందుకోసం వాట్సాప్ లో చాట్స్ పేజీలో కింద కనిపిస్తున్న మెస్సేజ్ ఐకాన్ పై ట్యాప్ చేయాలి. న్యూ గ్రూప్, న్యూ కాంటాక్ట్, న్యూ కమ్యూనిటీ తర్వాత.. మన నంబర్ పక్కన బ్రాకెట్ లో యు అని కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మీడియాను పంపే సమయంలో వాట్సాప్ సెర్చ్ ఐకాన్ లో వై అని టైప్ చేసినా మన నంబర్ కనిపిస్తుంది. 

వాట్సాప్ పోల్
వాట్సాప్ లో మరో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్ పోల్. అంటే ఎవరికి వారు పోల్ నిర్వహించుకోవచ్చు. విడిగా ఒక వ్యక్తికి కానీ, లేదంటే గ్రూప్ నకు కానీ ఈ పోల్ రూపంలో ప్రశ్నలు అడగొచ్చు. ఇందుకోసం వ్యక్తికి పోల్ పెట్టాలనుకుంటే సంబంధిత వ్యక్తి కాంటాక్ట్ చాట్ సెషన్ ఓపెన్ చేయాలి. లేదంటే గ్రూప్ చాట్ సెషన్ ఓపెన్ చేయాలి. కింద సందేశం టైప్ చేసే చోట కనిపించే అటాచ్ మెంట్ ఐకాన్ ను క్లిక్ చేయాలి. అప్పుడు మనకు డాక్యుమెంట్, కెమెరా ఇలా పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడే పోల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని, అడగాలనుకుంటున్న ప్రశ్న.. దానికి ఆప్షన్లు ఇచ్చి సెండ్ చేస్తే సరిపోతుంది.

అవతార్స్
వాట్సాప్ తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్ అవతార్. యూజర్లు తమదైన అవతార్ ను క్రియేట్ చేసుకుని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొవచ్చు. లేదంటే అవతార్ స్టిక్కర్ గా పంపుకోవచ్చు. 

కాల్ లింక్ ఫీచర్
ఇతరులను తమ కాల్ లోకి వచ్చి చేరాలంటూ లింక్ పంపుకోవచ్చు. ఇది ఎలా అంటే వాట్సాప్ ఓపెన్ చేసి పైన చాట్, స్టేటస్ తర్వాత కనిపించే కాల్ ను సెలక్ట్ చేయాలి. అక్కడ కింది భాగంలో కుడి వైపున కాల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు ఓపెన్ అయ్యే పేజీలో న్యూ కాల్ లింక్ అనే ఆప్షన్ మొదటగా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత, కాపీ లింక్ ఓకే చేసుకుని మరో చోట పేస్ట్ చేసి పంపుకోవచ్చు. లేదంటే సెండ్ లింక్ వయా వాట్సాప్ ను క్లిక్ చేసుకుంటే వాట్సాప్ లో ఎవరికి పంపుకోవాలన్నది అడుగుతుంది. ఒకరికంటే ఎక్కువ మందిని కాల్ లో చేరాలని కోరేందుకు ఇది ఉపయోగపడుతుంది.

  • Loading...

More Telugu News