revanth Reddy: సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ పూర్తి మద్దతు ఉంది: రేవంత్ రెడ్డి

KCR support is there for Sajjala comments says Revanth Reddy
  • రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలన్న సజ్జల
  • సజ్జల వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఖండించలేదన్న రేవంత్
  • అంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోందని విమర్శ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు నేతలు ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సజ్జల వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఖండించలేదని విమర్శించారు. సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ మద్దతు ఉందని ఆరోపించారు. 

అంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోందని... తెలంగాణ ప్రజలకు ఇది కేసీఆర్ చేస్తున్న ద్రోహమని విమర్శించారు. తెలంగాణ మేధావులు, అమరుల కుటుంబాలు, ప్రజలు కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని... ఈ రోజు నుంచి కేసీఆర్ కు తెలంగాణ పేగు బంధం తెగిపోయిందని అన్నారు.
revanth Reddy
Congress
KCR
TRS
Sajjala Ramakrishna Reddy
YSRCP

More Telugu News