PAN Card: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 తుది గడువు

PAN with AADHAR link up dead line extended

  • ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన కేంద్రం
  • ఈసారి ఆలస్య రుసుంతో తుది గడువు
  • 2023 మార్చి 31 లోపు లింక్ చేయకపోతే పాన్ నిరుపయోగం
  • ట్విట్టర్ లో ప్రకటన చేసిన ఐటీ శాఖ

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. ఈసారి 2023 మార్చి 31న తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ఆదాయ పన్ను శాఖ వివరణ ఇచ్చింది. 

ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విధించిన సాధారణ గడువు ముగిసిందని, గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన చేసింది.

  • Loading...

More Telugu News