Telangana: తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
- నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
- అజహరుద్దీన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
- రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ
- 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. తెలంగాణకు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది.
అటు, మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు.
24 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లను, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. అటు, కొత్త కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.