YSRCP: ట్విట్టర్ లోకి మళ్లీ వచ్చేశాం: వైసీపీ
- కొన్నిరోజుల కిందట వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
- వైసీపీ ఖాతాలో క్రిప్టో కరెన్సీ పోస్టులు
- ప్రొఫైల్ పిక్ లో కోతి బొమ్మ
- ట్విట్టర్ కు సమాచారం అందించిన వైసీపీ
- తాజాగా వైసీపీ అకౌంట్ పునరుద్ధరణ
కొన్నిరోజుల కిందట వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. వైసీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన అజ్ఞాత వ్యక్తులు అందులో క్రిప్టో కరెన్సీకి చెందిన వార్తలను పోస్టు చేశారు. ప్రొఫైల్, కవర్ పిక్ లను కూడా మార్చివేశారు. ప్రొఫైల్ పిక్ లో కోతి బొమ్మ పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి హ్యాకింగ్ ను గుర్తించిన వైసీపీ సాంకేతిక బృందం వెంటనే ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ కు సమాచారం అందించింది. తీవ్రంగా శ్రమించిన ట్విట్టర్ టీమ్ నేడు వైసీపీ ఖాతాను పునరుద్ధరించింది.
దీనిపై వైసీపీ స్పందించింది. హ్యాకింగ్ అనంతరం తొలి ట్వీట్ చేసింది. "గతంలో ఎన్నడూ లేని విధంగా మా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. గత 36 గంటలుగా మా ట్విట్టర్ ఖాతా మా అధీనంలో లేదు. ఇప్పుడు మా ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించారు. ఈ సహాయానికి ట్విట్టర్ మద్దతు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అని వైసీపీ ఆ ట్వీట్ లో పేర్కొంది.