Pension: రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల పెంపునకు ఏపీ క్యాబినెట్ ఆమోదం.. రూ.2,750కి పెరిగిన పెన్షన్

AP Cabinet approves pension hike

  • సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • ఇప్పుడిస్తున్న పెన్షన్ పై రూ.250 పెంపు
  • కడప జిల్లాలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు ఆమోదం 
  • బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో... ఇప్పుడిస్తున్న పెన్షన్ పై రూ.250 పెరగనుంది. తద్వారా పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగనుంది. పెంచిన పెన్షన్లు 2023 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటున్నవారు 62.31 లక్షల మంది ఉన్నారు. 

అటు నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూంలు, ఫౌండేషన్ స్మార్ట్ టీవీ రూంలను నిర్మించే ప్రతిపాదన, వైఎస్సార్ పశు బీమా పథకం ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు కూడా క్యాబినెట్ ఆమోదం లభించింది.

ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన మరికొన్ని నిర్ణయాలు ఇవే...

  • భూముల రీసర్వే కోసం పురపాలక చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. 
  • సీఎం జగన్ జన్మదినం సందర్భంగా డిసెంబరు 21వ తేదీన రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ. 5 లక్షల ట్యాబ్ ల పంపిణీ. 
  • టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం కొత్తగా చీఫ్ పీఆర్వో పోస్టు భర్తీకి ఆమోదం. 
  • కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి క్యాబినెట్ పచ్చజెండా. 
  • బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం.

  • Loading...

More Telugu News