Arjun Tendulkar: ఎట్టకేలకు రంజీల్లోకి సచిన్ తనయుడు... ముంబయి తరఫున కాదు!
- రంజీల్లో ఆడేందుకు చాలాకాలం నుంచి వేచిచూస్తున్న అర్జున్
- ముంబయి జట్టులో స్థానం దక్కని వైనం
- గోవాకు తరలివెళ్లిన సచిన్ కుమారుడు
- నేడు గోవా, రాజస్థాన్ జట్ల మధ్య రంజీ మ్యాచ్
- 4 పరుగులతో అర్జున్ బ్యాటింగ్
అర్జున్ టెండూల్కర్ భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అయినప్పటికీ రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 23 ఏళ్ల వయసులో అర్జున్ టెండూల్కర్ రంజీల్లో అడుగుపెట్టాడు. ముంబయి జట్టులో స్థానం దక్కకపోవడంతో గోవా తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు.
జూనియర్ క్రికెట్లో తనదైన ముద్రవేయడంలో విఫలమైన అర్జున్ అడపాదడపా రాణించినా, బలమైన ముంబయి జట్టులో స్థానం సంపాదించడానికి ఆ గణాంకాలు సరిపోలేదు. ముంబయి రంజీ టీమ్ లో పోటీ ఎక్కువగా ఉండడంతో గోవాకు తరలివెళ్లాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా ఇవాళ గోవా, రాజస్థాన్ మధ్య ఎలైట్ డివిజన్ గ్రూప్-సి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, గోవా బ్యాటింగ్ కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి గోవా 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు.