Norwegian diplomat: భారత్ లో కళ్లు చెదిరే రైల్వే లైన్ చూశారా..? మనసు పారేసుకున్న నార్వే రాయబారి
- కర్ణాటకలోని బెంగళూరు - ఉడుపి రైల్వే మార్గంలో ప్రయాణించాల్సిందే
- లోయలు, నదులు, సొరంగాల మధ్య ప్రయాణం
- చూడ్డానికి రెండు కళ్లు చాలవన్నంత సుందరమైన ప్రకృతి అందాలు
మన దేశంలో ఎన్నో అద్భుతమైన, అందమైన ప్రాంతాలు, రోడ్డు, రైల్వే మార్గాలున్నాయి. వీటి గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ. చిక్కటి పచ్చదనం పరుచుకున్న, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి పాములా సాగిపోయే ఓ రైల్వే లైన్ మన దేశంలో ఉంది. అది బెంగళూరు-ఉడిపి రైల్వేలైన్. దీన్ని ఏరియల్ గా చూస్తే కనురెప్పలు కూడా కాసేపు చలనం లేకుండా ఆగిపోతాయి. అంత అద్భుతంగా, అందంగా ఉంటుంది.