YS Sharmila: పాలేరులో వైఎస్సార్టీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన షర్మిల.. వీడియో ఇదిగో!

YS Sharmila lays foundation stone for party office in Palair
  • వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్న షర్మిల
  • హైదరాబాద్ వెలుపల పార్టీ తొలి కార్యాలయం
  • సంక్రాంతి తర్వాత పాదయాత్రను కొనసాగించనున్న షర్మిల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. వైఎస్సార్టీపీకి కేవలం హైదరాబాద్ లో మాత్రమే కార్యాలయం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వెలుపల పాలేరులో కూడా ఆఫీస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. 

వచ్చే ఏడాది తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాలేరులో పార్టీ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు, షర్మిల పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, సంక్రాంతి తర్వాత పాదయాత్రను మళ్లీ కొనసాగించనున్నట్టు ఆమె ప్రకటించారు.
YS Sharmila
YSRCP
Palair
Office

More Telugu News