Raj Nath Singh: అత్యంత శక్తిమంతమైన దేశంగా మారాలనుకోవడం లేదు.. ఇతర దేశాల భూభాగం మాకొద్దు: రాజ్ నాథ్ సింగ్

We dont want to a super power says Raj Nath Singh

  • ప్రపంచ సంక్షేమం కోసం పని చేయాలన్నదే తమ లక్ష్యమన్న రాజ్ నాథ్
  • మన సైనిక బలగాల ధైర్య, సాహసాలు ప్రశంసనీయమని కితాబు
  • అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్య

సరిహద్దుల్లో అనునిత్యం ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనాను ఉద్దేశించి భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరోక్ష విమర్శలు గుప్పించారు. తమకు ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలనే ఆలోచన లేదని చెప్పారు. ప్రపంచంలో అంత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని తాము కోరుకోవడం లేదని... ప్రపంచ సంక్షేమం కోసం పని చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గాల్వాన్ అయినా, తవాంగ్ అయినా మన సైనిక బలగాలు శౌర్యపరాక్రమాలను నిరూపించుకుంటున్నాయని చెప్పారు. వారు ప్రదర్శిస్తున్న ధైర్య, సాహసాలు ప్రశంసనీయమని కొనియాడారు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పారు. ప్రతిపక్షాల ఉద్దేశాలు ఏమిటో తాము ఎప్పుడూ ప్రశ్నించలేదని, వారి విధానాలనే ప్రశ్నిస్తున్నామని అన్నారు. వాస్తవాల ఆధారంగా ఎవరైనా మాట్లాడాలని... అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News