Julakanti Brahmareddy: మాచర్ల ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్ లు... జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
- మాచర్లలో గత రాత్రి హింసాత్మక ఘటనలు
- రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదు
- జూలకంటి సహా 9 మందిపై కేసు
- ఏ-1గా జూలకంటి
మాచర్లలో గత రాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు 9 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేస్తే, తామే ఈ దాడి చేశామని బ్రహ్మారెడ్డి తమపై దాడి చేశాడని ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసులు ఈ కేసులో బ్రహ్మారెడ్డిని ఏ-1గా చేర్చారు.