Vladimir Putin: నిఘా పెంచండి: భద్రతాదళాలకు పుతిన్ ఆదేశం

Putin orders for full surveillance

  • ఉక్రెయిన్ లోని నాలుగు ప్రధాన నగరాలను ఆక్రమించిన రష్యా
  • ఆ ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉందన్న పుతిన్
  • సరిహద్దుల్లో నిఘాను పెంచాలని ఆదేశం

ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. ఇప్పటికే ఆ దేశంలోకి ప్రధాన నగరాలైన డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ లను రష్యా ఆక్రమించుకుంది. అయితే, ఈ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అంగీకరించారు. ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటనలో ఉన్నారు. 

తాజాగా ఆయన సెక్యూరిటీ సర్వీసెస్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ఆ ప్రాంతాల్లోని ప్రజలకు భద్రతను కల్పించేలా సరిహద్దుల్లో నిఘాను పెంచాలని ఆదేశించారు. రష్యాలో ఉన్న దేశ ద్రోహులపై కూడా నిఘా పెట్టాలని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ కు ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు, మూడున్నరేళ్ల తర్వాత బెలారస్ లో పుతిన్ పర్యటిస్తున్నారు. బెలారస్ ను కూడా యుద్ధ రంగంలోకి దించే ప్రయత్నాలను పుతిన్ చేస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News