Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ పై రైల్వే బోర్డు వివరణ

Railway board explains on Visakha Railway Zone

  • చాలాకాలంగా ప్రతిపాదనల దశలో విశాఖ రైల్వే జోన్
  • పరిమితి అంటూ ఏమీ లేదన్న రైల్వే బోర్డు
  • రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి

సుదీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న విశాఖ రైల్వే జోన్ వ్యవహారంపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు పరిమితి అంటూ లేదని వెల్లడించింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. 

ఇక రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని పేర్కొంది. 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. కాజీపేటను కొత్త డివిజన్ చేసే ప్రతిపాదన ఏమీ లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News