Team India: ముగిసిన రెండో రోజు ఆట... భారత్ కు 87 పరుగుల ఆధిక్యం

Second day play concludes in Dhaka test

  • ఢాకాలో రెండో టెస్టు
  • టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్
  • తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 రన్స్
  • 314 పరుగులు చేసిన టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్

టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా బంగ్లాదేశ్ పై కీలకమైన 87 పరుగుల ఆధిక్యాన్ని పొందింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట చివరికి వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో 7 పరుగులు చేసింది. ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. 

అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేజార్చుకున్నారు. పంత్ 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 93 పరుగులు చేయగా, అయ్యర్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 159 పరుగులు జోడించడం విశేషం. 

బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4, కెప్టెన్ షకీబల్ హసన్ 4 వికెట్లు పడగొట్టారు. తస్కిన్ అహ్మద్ 1, మెహిదీ హసన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News