Pawan Kalyan: బాలకృష్ణ వీరసింహారెడ్డి సెట్స్ పై పవన్ కల్యాణ్.. ఫొటో ఇదిగో!

Pawan Kalyan goes to Balakrishna Veerasimhareddy sets
  • వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ
  • హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్న పవన్
  • ఇరువురు కలిసిన వేళ!
  • ఫొటో పంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్
అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఒకచోట కలవడం చాలా అరుదైన విషయం. అయితే, తాజాగా వీరిద్దరూ సెట్స్ పై కలిశారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, పవన్ వీరసింహారెడ్డి సెట్స్ కు వెళ్లారు. అక్కడ బాలకృష్ణను, ఇతర యూనిట్ సభ్యులను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. పవన్, బాలయ్య ఏకాంతంగా 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. పవన్ వీరసింహారెడ్డి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. 

కాగా, బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షోకి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది. 
Pawan Kalyan
Balakrishna
Veerasimhareddy
Harihara Veeramallu
Hyderabad
Tollywood

More Telugu News