Team India: హమ్మయ్య.. అశ్విన్, అయ్యర్​ పోరాటంతో గట్టెక్కిన భారత్​

Shreyas Iyer and R Ashwin take India in close finish 2nd test
  • 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠ విజయం
  • ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు జోడించిన అశ్విన్, అయ్యర్
  • రెండు టెస్టుల సిరీస్ ను 2–0తో గెలిచిన టీమిండియా
టెస్టు క్రికెట్ ను ఇష్టపడే అభిమానులకు భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు అసలైన మజా పంచింది. రెండు రోజులు అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్ లో చివరకు భారత్ 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దాంతో, రెండు టెస్టుల సిరీస్ ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది. నాలుగో రోజైన ఆదివారం విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడగా రవిచంద్రన్ అశ్విన్ (42 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) అద్భుత ఆటతో భారత్ ను విజేతగా నిలిపారు.

 145 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్(2), శుభమన్ గిల్(7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1), రిషభ్ పంత్(9) నిరాశ పరచడంతో ఓ దశలో  74/7తో జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో అశ్విన్, అయ్యర్ ఎనిమిదో వికెట్ కు అజేయంగా 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అక్షర్ పటేల్ (34) కూడా రాణించాడు. అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చతేశ్వర్ పుజారా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.
Team India
Bangladesh
2nd test
win
Ravichandran Ashwin
shreyas iyer

More Telugu News