USA: అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు శుభవార్త చెప్పిన అగ్రరాజ్యం
- వీసా ఇంటర్వ్యూ మినహాయింపు కొనసాగింపు
- 2023 డిసెంబరు 31 దాక పొడిగించిన అమెరికా
- కరోనా నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న అమెరికా ప్రభుత్వం
అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త. తమదేశ వీసాలకు సంబంధించి అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిన నేపథ్యంలో అమెరికా వీసా ఇంటర్వ్యూ మినహాయింపును కొనసాగించింది. వలసేతర వీసా కేటగిరీల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపును మరో ఏడాది పాటు పొడిగించింది. 2023 డిసెంబరు 31 దాకా మినహాయింపును కొనసాగించనుంది. ఇంటర్వ్యూ మినహాయింపుతో వీసా నిరీక్షణ సమయం బాగా తగ్గనుంది. అమెరికా తాజా నిర్ణయంతో భారత విద్యార్థులు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరనుంది.
ఇంటర్య్యూ మినహాయింపునకు ‘నిర్దిష్ట వలసేతర’ అంటూ అమెరికా వర్గీకరించిన వీసా కేటగిరీల్లో విద్యార్థులు, వృత్తి నిపుణులు, కార్మికులు కూడా ఉన్నారు. ప్రత్యేక విద్య సందర్శకులు, ఒక సంస్థ నుంచి మరో దానికి బదిలీ అయ్యేవారికి కూడా లబ్ది చేకూరుతుంది. అలాగే, వీసా ఉండి నాలుగేళ్లలోగా పునరుద్ధరణకు వెళ్లాలని భావించేవారికీ కూడా ఇంటర్వ్యూ మినహాయింపు వర్తించనుంది.