Google: గూగుల్ లో 6 శాతం ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన?

Google may fire 6 percent of employees with poor performance rating in 2023

  • సుమారు 10,000 మంది ఉద్యోగుల తొలగింపునకు అవకాశం
  • వీరి పనితీరు ఆశించిన విధంగా లేనట్టు సమాచారం
  • అధికారికంగా ఇంకా ప్రకటించని గూగుల్

కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు గూగుల్ షాక్ ఇవ్వనుంది. సుమారు 6 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని సమాచారం. పనితీరు బాగోలేదనే పేరుతో వీరిని తొలగించనుంది. ఇందుకోసం ముందుగానే గూగుల్ కొత్త పనితీరు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగుల పనితీరును మదింపు వేసి జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 6 శాతం మంది ఉద్యోగులు (10,000 మంది) తక్కువ పనితీరు (సరైన ఉత్పాదకత లేకపోవడం/మంచి ఫలితాలు చూపించకపోవడం), ఉత్పాదకత విభాగంలోకి వచ్చారని, వీరి ఉద్యోగాలు రిస్క్ లో పడినట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు సీఎన్ బీసీకి తెలిపాయి. 

గత వారం ఉద్యోగుల పనితీరుపై గూగుల్ ఓ సమావేశం కూడా నిర్వహించింది. గూగుల్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించనుందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాలు దీనికి అనుగుణంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటి వరకు గూగుల్ ఉద్యోగుల తొలగింపుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 6 శాతం మందిని గూగుల్ తొలగిస్తుందా? లేక పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఇస్తుందా? చూడాలి. మరోవైపు అమెజాన్, ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. 

  • Loading...

More Telugu News