Hansika Motwani: హనీమూన్ ను తెగ ఎంజాయ్ చేస్తున్న హన్సిక మోత్వానీ

Hansika Motwani rides around Budapest on e scooter during Europe honeymoon with Sohael Kathuriya
  • భర్త సొహైల్ తో కలసి యూరప్ ను చుట్టేస్తున్న హన్సిక  
  • బుడాపేస్ట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ సవారీ
  • వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ముద్దుగుమ్మ  
బాలీవుడ్ నటి హన్సిక మోత్వానీ హనీమూన్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. భర్త సోహైల్ తో కలసి ఆమె హనీమూన్ కోసం యూరప్ కు వెళ్లడం తెలిసిందే. వియన్నాలో ఆమె క్రిస్ మస్ వేడుకలను జరుపుకుంది. తాజాగా హంగేరీలోని బూడాపెస్ట్ కు సంబంధించి ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

బుడాపెస్ట్ లో రహదారి పక్కన ఆమె ఎలక్ట్రిక్ పొట్టి స్కూటర్ ను నడుపుతూ నవ్వులు చిందిస్తోంది. బ్లూ డెనిమ్, పైన బ్రౌన్ కోట్ తో కనిపించింది. ‘బుడాపెస్ట్ లోని హంగరీ పార్లమెంట్’ అనే క్యాప్షన్ ను వీడియోలో కనిపించేలా ఎడిట్ చేసింది. అంటే పార్లమెంట్ ముందు ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసినట్టు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ సినిమా 'దేశముదురు'తో హన్సిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తన యాక్టింగ్ చిరునామాని బాలీవుడ్ కు మార్చేసింది. చివరిగా తమిళ సినిమా మహాలో కనిపించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు హిందీ సినిమాల్లో నటించిన హన్సిక.. డిసెంబర్ 4న సొహైల్ కతూరియాను పెళ్లాడడం తెలిసిందే. (వీడియో కోసం)
Hansika Motwani
honeymoon
Europe
budapest
e scooter
Sohael Kathuriya

More Telugu News