Raghu Rama Krishna Raju: కలెక్టర్లు ఎవరినైనా తిడితే పరిణామాలు వేరేగా ఉంటాయి: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju reacts to CM Jagan suggestion to district collectors
  • పెన్షన్లపై దుష్ప్రచారాన్ని సహించవద్దన్న సీఎం జగన్
  • ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలని కలెక్టర్లకు సూచన 
  • 'తిట్లు తిట్టు-పోస్టు పట్టు' అంటూ రఘురామ వ్యంగ్యం
పెన్షన్ల విషయంలో ఎవరైనా దుష్ప్రచారం చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా ఖండించాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. జగన్ రెడ్డి పాలనలో 'తిట్లు తిట్టు-పోస్టు పట్టు' కార్యక్రమం కొనసాగుతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. విపక్షాల వారిని తిట్టాలంటూ కలెక్టర్లకు జగన్ రెడ్డి చెబుతున్నారని అన్నారు. కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరేగా ఉంటాయని రఘురామ స్పష్టం చేశారు. 

పెన్షన్లలో ఆరు నెలల కిందట ఉన్న అర్హత ఇప్పుడెలా పోతుందని ప్రశ్నించారు. పాలకులు తప్పులు చేస్తూ మీడియాను అనడం సరికాదని హితవు పలికారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి ప్రజలను మోసం చేశారని రఘురామ విమర్శించారు.
Raghu Rama Krishna Raju
District Collector
Jagan
Pensions
YSRCP
Andhra Pradesh

More Telugu News