Poonakalu Loading: 'వాల్తేరు వీరయ్య' నుంచి రేపు 'పూనకాలు లోడింగ్' విడుదల

Poonakalu Loading song from Walatair Veerayya will release on tomorrow
  • చిరంజీవి, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య
  • జనవరి 13న రిలీజ్
  • ఇప్పటికే మూడు పాటలు రిలీజ్
  • ఈసారి చిరు, రవితేజ పాట రిలీజ్ చేస్తున్న చిత్రబృందం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి మరో మాస్ సాంగ్ వస్తోంది. పూనకాలు లోడింగ్ అనే ఈ పాటలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. ఈ హుషారైన గీతాన్ని రేపు రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. మెగాస్టార్ × మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ అంటూ పాటపై అంచనాలు పెంచేసింది. 

వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు మెగా స్పందన వస్తోంది. 

వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక. ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండగా, కేథరిన్ ట్రెసా కీలకపాత్రలో కనిపించనుంది.
.
Poonakalu Loading
Song
Chiranjeevi
Raviteja
Waltair Veerayya
Bobby

More Telugu News